సహజ ప్రసవాలపై జాతీయ స్థాయి అవగాహన నడక’ను విజయవంతం చేయాలి

రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు మాసం అనిల్ కుమార్

సహజ ప్రసవాలపై జాతీయ స్థాయి అవగాహన నడక’ను విజయవంతం చేయాలి

ఆదిలాబాద్ డెస్క్ : సాధారణ ప్రసవాల (Natural Birthing) ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) మరియు సొసైటీ ఆఫ్ మిడ్‌వైవ్స్ ఇండియా (SOMI) సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 22, 2026న "నేషన్‌వైడ్ వాక్ ఫర్ నేచురల్ బర్తింగ్" (సహజ ప్రసవాలపై జాతీయ స్థాయి అవగాహన నడక) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆడే క్రాంతి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు మాసం అనిల్ కుమార్ మాట్లాడుతూ... ఈ అవగాహన నడక ముఖ్య ఉద్దేశ్యం 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువత మరియు సాధారణ ప్రజలకు సహజ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు, వాటి ఆవశ్యకతను వివరించడమని పేర్కొన్నారు కనుక 
బోథ్ నియోజవర్గం పరిధిలోకి అన్ని గ్రామాల యువతి యువకులు ఈ నడకలో పాల్గొనని విజయవంతం చేయాలి అని దీనికి ఎటువంటి రుసుము లేదని, రెడ్ క్రాస్ వాలంటీర్లు, యువత, మరియు పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమ వివరాలు తేదీ: 22 నవంబర్ 2026 (ఆదివారం)
రోజు సమయం: ఉదయం 6:00 / 6:30 నుండి 7:30 గంటల వరకువేదిక: ఆదిలాబాద్ పట్టణం లో ప్రవేశం ఉచితం మరియు స్వచ్ఛందం (Free and Voluntary)
రిజిస్ట్రేషన్ & సంప్రదించవలసిన వివరాలు:
ఆసక్తి గల వారు పోస్టర్‌లోని QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా ఈ క్రింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
* సౌత్ జోన్ (South Zone): ఫాతిమా జూలియట్ – 9985397125
* వెస్ట్ జోన్ (West Zone): రూత్ జోషిలా – 9440562290
* నార్త్ జోన్ (North Zone): రోహిణి నగారే – 7263968890
* ఈస్ట్ జోన్ (East Zone): మితాలి అధికారి – 9434942534
* ఇతర వివరాలకు: డి. స్టెల్లా – 8978944548 అని సంప్రదించాలి తెలిపారు

Views: 21

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News