సర్కారు స్కూళ్లకు బాసటగా నిలుస్తోన్న శ్రీకృష్ణ ఫౌండేషన్..
నిజామాబాద్ :
సమాజసేవే లక్ష్యంగా ఏర్పాటైన శ్రీకృష్ణ ఫౌండేషన్ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి బాసటగా నిలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
గ్రీన్ బోర్డుల విరాళం..
ఈ సందర్భంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకుల కొండూరు ప్రాథమిక పాఠశాలకురూ. రూ.10వేల విలువైన నాలుగు గ్రీన్ బోర్డులను అందజేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తరగతి గదుల్లో డస్ట్-లెస్ (Dustless) బోర్డులు ఉండాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ వీటిని పాఠశాలకు అందించింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఛైర్మన్ బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలను గుర్తించి వారికి తమ వంతు సాయంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు రమేష్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


