వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ
* అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పింఛన్లు అందించడమే లక్ష్యం: సర్పంచ్ మల్లారెడ్డి
చౌటకూర్,; చౌటకూర్ మండల పరిధిలోని వెండి కోల్ గ్రామంలో నూతనంగా 20 పింఛన్లు మంజూరు కావడంతో గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు.అనంతరం ఎంపీడీవో శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పింఛన్ల ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందజేస్తున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, ఎంపీడీవో శంకర్, గ్రామ ప్రజలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

