అంగన్వాడీలో శ్రీమంతాలు పిల్లల కు అన్న ప్రాసన కార్యక్రమం ..

అంగన్వాడీలో శ్రీమంతాలు  పిల్లల కు అన్న ప్రాసన కార్యక్రమం ..

గంభీరావుపేట :  గంభీరావుపేట మండలం లింగన్నపేట సెక్టార్ పరిధిలోని ముచర్ల తండా అంగన్వాడి సెంటర్ లో మంగళవారం  ట్యూస్డే 10 మినిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన అంగన్వాడి మన బాధ్యత అని అంగన్వాడి సెంటర్  లో  మనమే అన్ని సౌకర్యాలు కల్పించుకోవాలి అని చెప్పడం జరిగింది.ఎత్తుకు తగిన బరువు లేని పిల్లలను ఎత్తు బరువు చూడటం మరియు వారు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి అవగాహన కల్పించారు.  మరియు గర్భవతులకు శ్రీమంతాలు చేయడం 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ హనుమంతు నాయక్, ఎంపిడిఓ రాజేందర్, సర్పంచ్ భూక్యా పద్మ దేవ్ సింగ్ , మెడికల్ ఆఫీసర్ అభినవ్  ఐసిడిఎస్ సూపర్వైజర్ స్వరూప, సిహెచ్ఓ రవీందర్, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు భరత్,సెక్రటరీ, ఎమ్మెల్ హెచ్ పి , ఏఎన్ఎం, ఫీల్డ్ అసిస్టెంట్, అంగన్వాడి టీచర్ సుకన్య,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News