చౌటకూర్లో చేయూత పింఛన్ పత్రాల పంపిణీ
అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ పత్రాలు అందజేసిన గ్రామ సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి
చౌటకూర్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు చౌటకూర్ గ్రామంలో చేయూత పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ పార్కుల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న చేయూత పింఛన్లు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎంతో తోడ్పడుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని, పింఛన్ లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బి. సుభాష్ రెడ్డి, ఎంపీడీవో శంకర్, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ కళాలి రామా గౌడ్, ఉపసర్పంచ్ దమ్మి నాగరాణి కృష్ణ, వార్డు సభ్యులు గోరేమియా, జైపాల్ రెడ్డి, కొజ్జా లక్ష్మయ్య, ఏలియా, ప్యాట గంగారం, బాలు, మల్లేశం, అభిలాష్, డప్పు అశోక్, చక్రపాణి, నాయకులు కొలుకూరి మొగులయ్య, మహేష్, చేయూత పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


