కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు మోకాళ్లపై నిరసన తెలిపిన కార్మికులు

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు మోకాళ్లపై నిరసన తెలిపిన కార్మికులు

కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు మోకాళ్లపై నిరసన తెలిపిన కార్మికులు రెండవ రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రి కార్మికులు సెక్యూరిటీ గార్డ్ పేషెంట్ కేర్ శానిటేషన్ కార్మికులకు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని రెండో రోజు ఆసుపత్రి ముందు మోకాలపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజు మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు దశరథ్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు అవుతున్న కనీస వేతనాలు గత కాంట్రాక్టర్ వేతనాలతో ప్రభుత్వాలు కొనసాగిస్తున్నారని ఇప్పటికైనా నూతన టెండర్లలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంటాక్ట్ విధానాన్ని రద్దుచేసి కార్మికులకి పని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు  సుప్రీంకోర్టు జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు పి బాలరాజు మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు ఎల్ దశరథ్ మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆసుపత్రి కార్మికులు ఈ కార్యక్రమంలో సునీత. పా జియా. రాములు, నర్సింలు  లక్ష్మి, రఫిక్, రజిత, వాసవి, సత్యం, రాజయ్య, పద్మ వెంకటలక్ష్మి, సావిత్రి, దశరథ్, గంగాధర్, కనక లక్ష్మి, విజయ, పద్మ స్రవంతి, భాస్కర్, సావిత్రి, సతీష్, అర్జున్  తదితరులు పాల్గొన్నారు.

Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News