వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలి.

వలస గిరిజనేతరుల అక్రమ నిర్మాణాలకు పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపణ

వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్  కార్యదర్శిని నియమించాలి.

వెంకటాపురం : ములుగు జిల్లా,వెంకటాపురం మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమిచాలని జిఎస్పి జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రతాప్  డిమాండ్ చేశారు.మంగళవారం వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీం విగ్రహం ఆవరణంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిఎస్పి విద్యార్థి విభాగం నాయకులు పూనెం నితిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు.ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడంతో స్థానిక ప్రజలకు అనేక సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు.వెంకటాపురం గ్రామ పంచాయతీ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న కార్యదర్శి ఎల్టిఆర్, 1/70 చట్టానికి విరుద్ధంగా వలస గిరిజనేతరుల  అక్రమ నిర్మాణాలకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపించారు.,ఏజెన్సీ చట్టాలు నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ నుండి  బదిలీగా పంపించి,మళ్ళీ అదే కార్యదర్శని తిరిగి వెంకటాపురం మండల కేంద్రము లోని అదే గ్రామపంచాయతీకి ఇన్చార్జిగా విధులు నిర్వహించడం పట్ల స్థానిక ప్రజానికానికి చాలా అనుమానాలకు తావిస్తున్నాయి అని ,జిల్లా అధికారులు ఒక్కసారి పరిశీలన చేయాలని శాశ్వతకార్యదర్శిని నియమించాలని కోరారు . ఈ కార్యక్రమంలో కుంజా ప్రకాష్,పూనెం పార్థు,చంటి తదితరులు పాల్గొన్నారు.

Views: 362

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News