శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: కొక్కిరాల సురేఖ
నస్పూర్ (మంచిర్యాల), : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో నిర్వహించిన శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. శ్రీ కట్ట మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపాకటాక్షాలతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ పూదరి సునీత-ప్రభాకర్ దంపతులు, మంచిర్యాల జిల్లా ఐఎన్టీయూసీ (INTUC) అధ్యక్షులు పూదరి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు కొక్కిరాల సురేఖ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


