కామారెడ్డిలో బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి!

కిలో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయాలు.. సామాన్యులపై పెరుగుతున్న భారం

కామారెడ్డిలో బియ్యం ధరల కృత్రిమ పెంపు.. అక్రమ నిల్వలపై కొరడా ఝళిపించాలి!

కామారెడ్డి :  కామారెడ్డి జిల్లాలో బియ్యం ధరల కృత్రిమ పెంపు, అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పౌరసరఫరాల అధికారి (DCSO) వెంకటేశ్వర్లుకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRACCCI) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్ ఫిర్యాదు చేశారు. ఎల్‌నినో పరిస్థితులను సాకుగా చూపుతూ కొందరు పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు సన్నబియ్యం రకాల కొరతను కృత్రిమంగా సృష్టించి ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బీపీటీ/కేఎన్ఎం బియ్యం కిలో రూ.66, ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) రూ.74, హెచ్‌ఎంటీ/జై శ్రీరామ్ రూ.79 ఉండాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కిలో రూ.90 నుంచి రూ.130 వరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నాణ్యత లేని ఇతర రకాల బియ్యాన్ని ప్రీమియం సన్నబియ్యం పేరుతో విక్రయిస్తున్నారని, రైస్ మిల్లులు, గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా రైస్ మిల్లులు, గోదాములు, హోల్‌సేల్ వ్యాపార కేంద్రాలపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులు, మిల్లర్లపై నిత్యావసర వస్తువుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ధరలకు అనుగుణంగా నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడంతో పాటు, రైస్ మిల్లులు, సహకార విక్రయ కేంద్రాలు లేదా ప్రత్యేక రిటైల్ కౌంటర్ల ద్వారా సరసమైన ధరలకు బియ్యం విక్రయించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రోజువారీ కూలీలు, పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం పడకుండా తక్షణమే స్పందించి వినియోగదారులకు న్యాయం చేయాలని డీసీఎస్‌వోను కోరినట్లు శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు.శ్రీరామ్ వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (NHRACCCI)
మొబైల్: 8885795885

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News