పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలి - బీజేపీ 48 గంటల నిరసనకు మహిళా మోర్చా మద్దతు కొర్ర సుమలత.

పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలి - బీజేపీ 48 గంటల నిరసనకు మహిళా మోర్చా మద్దతు  కొర్ర సుమలత.

ములుగు, : ములుగు మున్సిపాలిటీలో పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ చేపట్టిన 48 గంటల నిరసన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ నిరసనకు మహిళా మోర్చా నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించి, నిరసనలో చురుగ్గా పాల్గొన్నారు.

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళా మోర్చా నాయకురాలు కొర్ర సుమలత మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర ధరలు, కరెంటు బిల్లులు, పిల్లల చదువుల ఖర్చులతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్నులు పెంచడం పేద, మధ్య తరగతి కుటుంబాలపై పెను భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.పెంచిన పన్నుల వల్ల సొంత ఇల్లు ఉన్న వారు కూడా పన్ను కట్టలేని దుస్థితికి చేరుకున్నారని అన్నారు. ముఖ్యంగా వితంతువులు, వృద్ధులు, కూలీ పనులు చేసుకునే కుటుంబాలు పన్నుల భారాన్ని మోయలేకపోతున్నాయని తెలిపారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఏకపక్షంగా పన్నులు పెంచడం సరికాదని విమర్శించారు.

మున్సిపాలిటీలో మౌలిక వసతులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని ఆరోపించారు. చాలా వార్డుల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, తాగునీటి సమస్య తీరలేదని, పారిశుద్ధ్యం కూడా సరిగా లేదని అన్నారు. సౌకర్యాలు కల్పించకుండా పన్నులు మాత్రం పెంచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ముందు ప్రజలకు మెరుగైన సేవలు అందించి, ఆ తర్వాతే పన్నుల విషయం ఆలోచించాలని సూచించారు.

పెంచిన ఇంటి పన్నులను వెంటనే తగ్గించి, పాత పన్నులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపశమనం కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బీజేపీ, మహిళా మోర్చా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని, న్యాయం జరిగే వరకు నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తామని కొర్ర సుమలత తెలిపారు.మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి పన్నుల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు, వివిధ వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News