శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
-మెరిట్ స్కాలర్షిప్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వక్తలు
అందోల్ : ,విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం వల్ల వారిలో చదువు పట్ల మరింత శ్రద్ధ పెరిగి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందని గ్రామ సర్పంచ్ పడిగే జ్యోతి రమేష్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల శేషారెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా పదో తరగతి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ సేవలు అభినందనీయమని వారు కొనియాడారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈకార్యక్రమంలో, పదో తరగతి మండల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని మొల్ల నేహకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున ప్రకటించిన రూ.10,000 నగదు ప్రోత్సాహక చెక్కును అతిథుల చేతుల మీదుగా అందజేశారు.విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు సంస్థ రూ.2 కోట్ల రూపాయలను నగదు బహుమతులుగా కేటాయించడం ప్రశంసనీయమని వారు అన్నారు.ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రమేష్ మాట్లాడుతూ.. శ్రీరామ్ గ్రూప్ ఫౌండర్ త్యాగరాజన్ గొప్ప అభ్యుదయ భావాలు కలిగిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.రూ.3 వేల కోట్లకు పైగా ఆస్తిని సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ధారాదత్తం చేసిన గొప్ప మనసు ఆయనదని గుర్తుచేశారు.విద్యార్థులు త్యాగరాజన్ ను ఆదర్శంగా తీసుకొని,భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగంలో తమదైన ముద్ర వేయాలని ఆకాంక్షించారు.
అనంతరం జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైన ఇదే పాఠశాల విద్యార్థిని పూజశ్రీ కి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సిబ్బంది తక్షణ నగదు బహుమతిని అందించి అభినందించారు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు అందించే రూ.2 కోట్ల స్కాలర్షిప్ పథకానికి సంబంధించిన 'చదువుకో తెలంగాణ' పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో చిల్వేర్ సర్పంచ్ శశిధర్ రెడ్డి, బైరన్ దిబ్బ వీరప్ప ,పంచాయతీ కార్యదర్శి నాగరాజు,ప్రధానోపాధ్యాయుడు రమేష్ ,నాయకులు నర్సింలు, బలరాం, పోచయ్య, వెంకట్, ప్రభు, మల్లేశం, ఉపాధ్యాయులు జనార్ధన్, సంజీవయ్య, ఆంజనేయులు, దీన, అరుణ, రుక్మిణి, రాజారత్నం, సంతోష్, దేవానంద్, గురు చరణం, శ్రీకాంత్, రాధిక, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ పూర్ణచందర్, ఎగ్జిక్యూటివ్స్ వడ్ల బాలాజీ , వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


