జనచైతన్య కళాకారుల సంఘానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రూ.లక్ష విరాళం

సామాజిక చైతన్య కార్యక్రమాలకు కళాకారుల ముందడుగు అభినందనీయం ఎమ్మెల్యే

జనచైతన్య కళాకారుల సంఘానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రూ.లక్ష విరాళం

కామారెడ్డి  : సమాజంలో నెలకొన్న సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జనచైతన్య కళాకారుల సంఘం కామారెడ్డి జిల్లా చేపట్టనున్న స్వచ్ఛంద అవగాహన కార్యక్రమాలకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన వంతు సహకారంగా రూ.లక్ష విరాళాన్ని అందజేశారు.జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో డ్రగ్స్, మద్యపానం, గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, మహిళలపై వేధింపులు తదితర సామాజిక సమస్యలపై కళాకారుల ద్వారా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు జనచైతన్య కళాకారుల సంఘం ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన రవాణా ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పెద్ద మనసుతో రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించి అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతను పెడదారి పట్టిస్తున్న మాదకద్రవ్యాలు, మద్యపానం, ఆన్‌లైన్ బెట్టింగ్‌లు వంటి సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఎంతో అవసరమని అన్నారు. సామాజిక బాధ్యతతో కళాకారులు స్వచ్ఛందంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ప్రశంసించారు. సమాజ శ్రేయస్సు కోసం కళను వేదికగా చేసుకుని ప్రజలకు మంచి సందేశాన్ని అందించాలని కళాకారులకు సూచించారు.అనంతరం సంఘం అధ్యక్షుడు కాగుల మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. కళాకారుల పట్ల, కళ పట్ల, ప్రజా చైతన్యం పట్ల ఎంతో ప్రేమతో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అందించిన లక్ష రూపాయల విరాళాన్ని ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలకే పూర్తిగా వినియోగిస్తామని తెలిపారు. సామాజిక బాధ్యతతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రోత్సాహం అందించిన ఎమ్మెల్యేకు జనచైతన్య కళాకారుల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఆయన అందించిన సహకారానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. లింగంపేటలోని జీవీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విరాళం అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు రాము పటేల్, ప్రధాన కార్యదర్శి బిట్ల సురేందర్, కోశాధికారి మహమ్మద్ మైను, లింగాల యాదగిరి గౌడ్, రాజిరెడ్డి, యాదన్న, లక్ష్మణ్, మంగలి సత్యనారాయణ, వినోద్ కుమార్, ఆగమయ్య, ఇమామ్, రెడ్డి స్వప్న, పవిత్ర, రాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News