పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ కొండంత భరోసా.. 60 మందికి రూ.17.40 లక్షల సాయం
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి భరోసా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ : ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేములవాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ పరిధిలోని 60 మంది లబ్ధిదారులకు రూ.17.40 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్సలు చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
16 Nov 2026 20:05:58
అందోల్ : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
