చౌటకూర్ నూతన తహసీల్దార్ విజయలక్ష్మికి ఘన సన్మానం
చౌటకూర్ మండల ఎమ్మార్వోగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని గ్రామ సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
చౌటకూర్ : మండలానికి నూతన ఎమ్మార్వోగా నియమితులైన విజయలక్ష్మిని చౌటకూర్ గ్రామ సర్పంచ్ పార్కల రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మార్వో విజయలక్ష్మికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మి ఆధ్వర్యంలో మండలంలో రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రామా గౌడ్, ఉపసర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు గోరేమియా, జైపాల్ రెడ్డి, కొజ్జ లక్ష్మయ్య, బేకరీ ఏలియా, గంగారం, బాలు, అభిలాష్, మల్లేశం, డప్పు అశోక్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


