నేటి బాలలే రేపటి భారత నిర్మాతలు
-మాజీ జిల్లా విద్యాధికారి ఎన్. వి. దుర్గాప్రసాద్ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన సత్యశోధక్ పాఠశాల
నిజామాబాద్ : బాల్యం ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన దశ. పిల్లల్లోని సృజనాత్మకత, జిజ్ఞాస, ప్రతిభను వెలికితీసి, వారికి ప్రేమ, స్వేచ్ఛ, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యతని నేటి బాలలే రేపటి భారత నిర్మాతలని మాజీ నిజామాబాద్ జిల్లా విద్యాధికారి ఎన్. వి. దుర్గాప్రసాద్ అన్నారు.
భారతదేశ తొలి ప్రధాని,నవ భారత నిర్మాత,భారత రత్న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 137వ జయంతి, బాలల దినోత్సవాన్ని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించనైనది. మొదటగా ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించినైనది. ముఖ్య అతిథిగా మాజీ నిజామాబాద్ జిల్లా విద్యాధికారి ఎన్. వి. దుర్గాప్రసాద్ విచ్చేయడమైనది. ఈ సందర్బంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి చిన్నారి కలను గౌరవిస్తూ, జ్ఞానం, మానవీయ విలువలు, ఆత్మవిశ్వాసంతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నదే ఉపాధ్యాయుల లక్ష్యమని తెలిపారు. చిన్నారులకు రెక్కలు తొడిగి, వారి విజయాలతో లోకమంతా వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు. విద్యార్థులను తమ స్వంత పిల్లలుగా భావించి ఓపికతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు, గ్రామీణ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్న పాఠశాల యాజమాన్యం అభినందనీయులన్నారు.
ఈ సంధర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేయనైనది.విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను విశేషంగా ఆకర్శించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది మరియు విద్యార్ధులు పాల్గొనడమైనదిv
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


