డబ్బుల విషయంలో తల్లితో గొడవ.. రోకలి బండతో తలపై దాడి చేసి హత్య!
శంకరంపేట మండలం శివాయపల్లిలో దారుణ ఘటన.. నిందితుడిపై కేసు నమోదు
పెద్ద శంకరంపేట్ : శంకరంపేట మండలం శివాయపల్లి గ్రామంలో డబ్బుల విషయంలో జరిగిన కుటుంబ కలహం విషాదానికి దారితీసింది. కన్నతల్లినే కుమారుడు రోకలి బండతో తలపై కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే పేట ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 16-11-2026న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో గ్రామానికి చెందిన చిలకముక్కు పాపయ్య డబ్బుల విషయమై తన తల్లి చిలకముక్కు పద్మమ్మతో పాటు భార్యతో గొడవకు దిగాడు. తన తల్లి వల్లే డబ్బుల సమస్యలు ఎదురవుతున్నాయని ఆగ్రహానికి గురైన పాపయ్య, ఆమెను హత్య చేయాలనే ఉద్దేశంతో రోకలి బండ తీసుకొని పద్మమ్మ తలపై బలంగా కొట్టాడు.ఈ దాడిలో పద్మమ్మ తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. వెంటనే 108 అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి విధుల్లో ఉన్న వైద్యుడు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనపై మృతురాలి అక్క కుమారుడు చిలకముక్కు కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


