లారీ – టీవీఎస్ ఎక్సెల్​​ ఢీ.. ఒకరి దుర్మరణం

లారీ – టీవీఎస్ ఎక్సెల్​​ ఢీ.. ఒకరి దుర్మరణం

నిజామాబాద్ : లారీ – టీవీఎస్ ఎక్సెల్​​ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్​ నగరంలోని న్యాల్​కల్ పీఎఫ్​ కార్యాలయం​ ఎదురుగా ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
లారీ అతివేగమే కారణం..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్​ వాసి మేదరి లక్ష్మణ్​ తన టీవీఎస్​ ఎక్సెల్​పై రిపేర్ ​అయిన టీవీని తన మనవడితో కలిసి తీసుకుని వెళ్తున్నారు. అయితే అదే సమయంలో ఎదరురుగా అతివేగంగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది.
దీంతో కింద పడిపోయిన లక్ష్మణ్ తీవ్రంగా గాయపడి​ సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. మనవడు శివానంద్​కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఐదో టౌన్​ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్​ అన్సార్​ఖాన్​పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News