నిద్రావస్థలో అధికార యంత్రాంగం
మొరం మాఫియాకు అడ్డుకట్ట లేదా?
నాగర్‌కర్నూల్: బిజినపల్లి మండలంలో ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి.గ్రామంలో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరు వల్ల మొరం మాఫియా రోజురోజుకు బలపడుతోంది.అనుమతి లేకుండా ట్రాక్టర్లు,టిప్పర్లతో మొరం మట్టిని బహిరంగంగా దోచుకుంటున్నా సంబంధిత రెవెన్యూ,మైనింగ్ అధికారులు కుంభకర్ణ నిద్రపోతున్నారు. మొరం లోడుతో వెళ్తున్న వాహనాలను ఒక్క అధికారి కూడా అడ్డుకోవడానికి సాహసించడం లేదు.పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫైల్ పై దుమ్ము కూడా కదలడం లేదు.అక్రమార్కులకు అధికారుల అండదండలు ఉండటంతోనేఇంత ధైర్యంగా ప్రభుత్వ ఆస్తిని దోచుకుంటు తమ జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజల పన్నులతో ఏర్పడిన ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ,ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నమొరం మాఫియాపై జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
