చినుకు పడిందని సంబరపడితే నష్టమే
ఆరుతడి, కూరగాయల సాగుకే ప్రాధాన్యం ఇవ్వాలి
జిల్లాలో 52% వర్షాభావ లోటు:
ఏఈఓలు బి.ప్రశాంత్, సుభాహన్ పాషా కొప్పునూరు,
పెద్దమారూర్‌లో క్షేత్రస్థాయి పరిశీలనలు
చిన్నంబావి/ వనపర్తి : పడే చిన్నపాటి వర్షాలకు తొందరపడకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకే ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల పరిధిలోని కొప్పునూరు, పెద్దమారూర్ గ్రామాల్లో ఏఈఓలు బి.ప్రశాంత్ కుమార్, సుభాహన్ పాషా క్షేత్ర సందర్శనలు, రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వనపర్తి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాక 52% వర్షాభావ లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున రైతులు తొందరపడి పంట నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. నీటి ఎద్దడిని తట్టుకునే కంది, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు, ఆయిల్ పామ్ మరియు కూరగాయల పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ఆరుతడి పంటల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందిస్తోందని తెలిపారు. పొలాల్లో తేమ సంరక్షణ చర్యలు చేపడుతూ అధికారుల సలహాలు పాటించాలని రైతులను కోరారు.

Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
05 Aug 2026 18:12:49
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
