విద్యే ప్రగతికి సోపానం...
.jpg)
- వనవాసీ విద్యార్థులకు కానిస్టేబుల్ వేమాల ప్రసాద్ ఉద్బోధ
చర్ల, (భద్రాద్రి కొత్తగూడెం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లోగల వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ నిలయంలో నిహాల్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి, ఈ వేడుకలను కేవలం విందు వినోదాలకే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే రీతిలో జరుపుకోవచ్చని వెంకటాపురం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేమాల ప్రసాద్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తమ కుమారుడు నిహాల్ జన్మదినాన్ని పురస్కరించుకుని, వారు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ 'కొమరం భీమ్ నిలయం'లో వసతి పొందుతున్న విద్యార్థులకు అండగా నిలిచారు,
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కానిస్టేబుల్ వేమాల ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చిన్నతనం నుండే ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, క్రమశిక్షణతో చదువుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు అని ఉద్బోధించారు.,గిరిజన విద్యార్థుల క్రమశిక్షణ తనను ఎంతగానో ఆకట్టుకుందని, అందుకే వారి మధ్య ఈ వేడుకను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.,విద్యార్థులకు దుస్తులు, కంబాక్స్ లు, పెన్నులు, పెన్సిల్స్ వంటి విద్యా సామగ్రితో పాటు పండ్లను పంపిణీ చేశారు.
వనవాసీ కళ్యాణ పరిషత్ జిల్లా కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సహకారం లేకుండా కేవలం దాతల విరాళాలతోనే నడుస్తున్న ఈ సంస్థ, గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోంది. కుటుంబంలో ఒక్కరు చదువుకున్నా ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు, వేడుకల పేరుతో డబ్బు వృథా చేయకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని ఆయన దాతలను కొనియాడారు ,దాతలు ముందుకు వచ్చి విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని, తద్వారా వారు ఉన్నత శిఖరాలను అధిరోహించేలా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేమాల సునీత, వనవాసీ జిల్లా సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, జిల్లా సంఘటనా సహ కార్యదర్శి గొంది శోభన్ బాబు, కొమరం భీమ్ నిలయ ప్రముఖ్ ఆకుల సాంబయ్య, శబరి బాలికా నిలయ ప్రముఖ్ వరలక్ష్మి, మడకం చందు, కూడం ఉంగయ్య, ప్రసాద్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 34
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
29 Jul 2026 18:29:50
మర్పల్లి,: వికారాబాద్ జిల్లా కేంద్రంలో నీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అనంతగిరి శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన పెరుగు బసంతోత్సవంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం...
