విజన్ ఆంధ్ర కథనంతో మూతపడ్డ పల్లె దవాఖాన తలుపులు తెరుచుకున్నాయి.
👉🏻మందులు లేక దవాఖానాను మూసివేసాం....
👉🏻దవాఖాన చుట్టూ రోజు తిరిగిపోతున్న రోగులు....
👉🏻 పల్లె దవాఖానాలకు ప్రభుత్వం నుండి మందుల సప్లై లేదు....
👉🏻 చంటి పిల్లలకు వ్యాక్సిన్ లేదు....
👉🏻 పిల్ల తల్లులు వారం, వారం ధవాఖాన చుట్టు తిరిగి పోతున్నాం....
ఘట్కేసర్ : ఏ ఎన్ ఎం ల సమ్మెతో మూతపడ్డ పల్లె దవాఖాన అంటూ (విజన్ ఆంధ్ర) పత్రికల్లో ప్రచురితమైన కథనానికి డాక్టర్లు స్పందించి బుధవారం ఉదయం అన్నోజిగూడ పల్లె దవాఖాన తలుపులు తెరుచుకున్నాయి. దీంతో విషయాన్ని తెలుసుకున్న విజన్ ఆంధ్ర ప్రతినిధి దవాఖాన కు వెళ్లి ఆశా వర్కర్ ను, డాక్టర్ ను సంప్రదించి మూసివేసిన విషయాన్ని అడుగగా ఇక్కడ పని చేసే ఏఎన్ఎం లు చేస్తున్న సమ్మె కారణంగా, మరియు ఆస్పత్రికి ప్రభుత్వము నుండి వచ్చే మందులు రాకపోవడంతో, ఇక్కడికి వచ్చే రోగులకు మందులు లేవని సమాధానం చెప్పలేక మూసివేసామని ఆ డాక్టర్స్ సమాధానమిచ్చారు. రోగులు మాత్రం సమయానికి మందులు దొరకక నానా అవసరం పడుతున్నారు . రోజు దావఖానా చుట్టూ చెక్కర్లు కొడుతూ సర్కారు పై దుమ్మెత్తి పోస్తున్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోచారం డివిజన్ అన్నోజిగూడ గ్రామంలో ఉన్న పల్లె ధావఖాన మూతపడి వారం రోజులు అవుతుంది.
👉🏻 రోగుల ఆవేదన
సమ్మెతో మూతపడిన పల్లె దవఖాన చుట్టూ రోజు రోగులు చెక్కర్లు కొడుతూ నానా అవస్థలు పడుతున్నారు.
బీపీ షుగర్ గోళీలు లేక 20 రోజుల నుండి బయట కొనలేక పోతున్నాను. ప్రభుత్వం మందులు సరఫరా చేయక చేస్తున్న మొండి వైఖరిని తగ్గించుకోవాలి.
👉🏻 ఫోటో పేరు నల్లవెల్లి శంకరమ్మ
ప్రతిరోజు వందలాది మందికి బీపీ, షుగర్, జ్వరం, గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు చంటి పిల్లలకు వ్యాక్సిన్ వంటి వివిధ వ్యాధుల పరంగా నిత్యం ప్రాథమిక చికిత్స కోసం వచ్చే ప్రజలు నాన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
👉🏻 ఫోటో పేరు
పంచి వోరాన్
చంటి పిల్ల తల్లి ఫోటో
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల
సమయంలో వైద్య సిబ్బందీ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆవేదనను వ్యక్తం చేస్తూ ప్రతిరోజు దవాఖానాను మూసివేసి ధర్నాలో పాల్గొంటున్న వారి న్యాయమైన కోరికను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పరిష్కరించి, సిబ్బందిని త్వరగా విధులకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
👉🏻 ఫోటో పేరు నరసమ్మ
ఏది ఏమైనప్పటికీ ప్రజల అత్యవసరం కోసం నిర్మించిన ఈ దవఖానను ఇలా మూసి వేయడం కరెక్టు కాదని ప్రజలు, రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉన్నత వైద్యాధికారులైన వచ్చి ప్రజలకు సేవలు అందించాలని కోరుకుంటున్నారు. రోగులకు వైద్య సేవలు అందించకుండా ధర్నాల పేరిట వారు ఇలా దావఖానాను మూసి వేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాం చేస్తున్నటువంటి ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలకు కావాల్సినన్ని మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసి ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారిస్తున్నారు. ఇకనైనా పల్లె దావఖానాలపై వైద్యాధికారులు దృష్టి సారించి ప్రజలకు వైద్య సేవలను అందించాలని కోరుకుంటున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలను చేపట్టాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరిస్తున్నారు. పల్లె దవఖానాల వద్ద రోగులు ప్రజలు ధర్నాలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇట్టి సమస్యను పరిష్కరించి రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


