కొంపల్లిలో ఘనంగా ఎస్‌వీఎం గ్రాండ్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్

కొంపల్లిలో ఘనంగా ఎస్‌వీఎం గ్రాండ్ ప్రారంభోత్సవం

కొంపల్లి: నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌వీఎం గ్రాండ్ లక్సరి హోటల్  ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ హోటల్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ, కొంపల్లి ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంతంలో ఆధునిక వసతులతో కూడిన హోటళ్లు, ఫంక్షన్ వేదికలు అందుబాటులోకి రావడం సంతోషకరమని అన్నారు. ఇటువంటి సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఎస్‌వీఎం గ్రాండ్  అతిథుల సౌకర్యార్థం ఆధునిక వసతులతో కూడిన రూమ్స్, ప్రత్యేక బాంక్వెట్ హాల్ అందుబాటులో ఉన్నాయి. కుటుంబ కార్యక్రమాలు, వివాహ వేడుకలు, పుట్టినరోజు వేడుకలు, సమావేశాలు, ఇతర శుభకార్యాలను నిర్వహించుకోవడానికి ఈ హోటల్ అనుకూలంగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, ఆహ్వానితులు, స్నేహితులు పాల్గొని నూతన సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొంపల్లి ప్రాంతంలో ఆతిథ్య సేవలకు ఎస్‌వీఎం గ్రాండ్ లక్స్ మరింత గుర్తింపు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా
మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజంనిజామాబాద్ అక్టోబర్27:( విజన్ ఆంధ్ర) ఇందూరులో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ఆర్ఓబిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం...
జంట నగరాల శెట్టిబలిజ సంఘం వైఎఫ్సిఏ కొత్త బాడీ సభ్యులకు, హాఫిజ్ పేట శెట్టిబలిజ సంఘం వారు ఘన సన్మానం
కొంపల్లిలో ఘనంగా ఎస్‌వీఎం గ్రాండ్ ప్రారంభోత్సవం
మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.
ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. రంగాయపల్లిలో విషాదం