కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నం.. చీరను కత్తిరించి వ్యక్తిని రక్షించిన పోలీసులు
మెదక్ : కుటుంబ కలహాల నేపథ్యంలో వెల్దుర్తి మండల పరిధిలో సంతోష్ అనే వ్యక్తి ఇంట్లో తలుపులు వేసుకొని ఉరివేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటనపై డయల్ 112కు సమాచారం అందడంతో వెంటనే స్పందించిన బీసీ సిబ్బంది రమేష్, హోంగార్డు మైసయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో ఉన్న సంతోష్‌ను గమనించిన సిబ్బంది తక్షణమే అప్రమత్తమై, సమయస్ఫూర్తితో చీరను కత్తిరించి అతడిని కిందకు దించి రక్షించారు. అనంతరం అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు. సకాలంలో స్పందించి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన బీసీ సిబ్బంది రమేష్, హోంగార్డు మైసయ్యల సమయస్ఫూర్తి, సేవలను అక్కడి ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


