తెరవని అంగన్వాడీ కేంద్రం.. ఇబ్బందుల్లో చిన్నారులు!r Title
రాజీవ్ నగర్ తండాలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ రవి నాయక్
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం రాజీవ్ నగర్ తండాలోని అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం బిచ్యానాయక్ తండా సర్పంచ్ రవి నాయక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రం తెరవకపోవడంతో అక్కడికి వచ్చిన చిన్నారులు బయట ఆవరణలోనే నిరీక్షిస్తూ, ఇష్టానుసారంగా ఆడుకుంటూ కనిపించారు. చిన్నారులకు సరైన పర్యవేక్షణ, భద్రత లేకుండా ఉండటంపై సర్పంచ్ ఆందోళన వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చిన్నారులకు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాలను నిర్ణీత సమయానికి తెరిచి, చిన్నారులకు భద్రతతో కూడిన సేవలు అందించాలని సంబంధిత సిబ్బందిని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


