అనుమతులు లేని రెసోనాన్స్ కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి.
డిఐఈఓ కు వినతిపత్రం అందజేసిన టిఎస్ఎ
నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కనీస భవనం కూడా లేకుండా 2027 -2028 విద్యా సంవత్సరానికై జూనియర్ కాలేజీ అడ్మిషన్లు చేస్తున్నటువంటి రెసోనాన్స్ యాజమాన్యం పై కఠినమైన చర్యలు తీసుకోవాలని గురువారం తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల. మాట్లాడుతూ అసలు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్మిషన్ ప్రక్రియ చేయడంతో పాటు ఈ సంవత్సరం పూర్తికానికి ఇంకా 6 నుంచి 7 నెలల సమయం ఉన్నప్పటికీ ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి అవ్వకుండానే తర్వాత సంవత్సరానికి జూనియర్ కళాశాల అడ్మిషన్స్ చేయడం దారుణమని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ కళాశాలలకు అదే విధంగా ప్రైవేటు కళాశాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు అసలు విద్యాశాఖ నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత విచ్చల విడిగా అడ్మిషన్ ప్రక్రియ చేపట్టడం ఏమిటని తక్షణమే ఆ యాజమాన్యాన్ని సంప్రదించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. . కళాశాల భవనము లేకుండానే ఇంటర్మీడియట్ నుంచి గుర్తింపు వచ్చిన తర్వాతనే అడ్మిషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ని కలుస్తామని అవసరమైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కు వెళ్లి ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సిందిగా జ్వాల డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

