గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపలేని కాంగ్రెస్ ప్రభుత్వం

గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపలేని కాంగ్రెస్ ప్రభుత్వం

హుస్నాబాద్ : కరువు మండలాల ప్రకటనలోనూ హుస్నాబాద్ నియోజకవర్గ రైతులకు అన్యాయము జరిగిందని 
పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ 
బీజేపీ సిద్ధిపేట్ జిల్లా కార్యదర్శి తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 
గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు లేవు.. రైతులకు విత్తనాలు లేవు.. రైతులను ఆగం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం! 
గౌరవెల్లి ప్రాజెక్టు కింద ఉన్న మండలాల రైతుల కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు ఇప్పటికీ నిరాశే మిగులుతోంది. ప్రాజెక్టులో నీళ్లు నింపి రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ మండలాలకు కరువు గుర్తింపు ఎందుకు కల్పించలేదు? కరువు పరిస్థితులను అంచనా వేయడానికి ప్రభుత్వం అనుసరించిన విధానాలు ఏంటని అన్నారు.ఒకవైపు ప్రాజెక్టులో నీళ్లు లేవు.. మరోవైపు కరువు గుర్తింపు లేదు.. మరి రైతులకు భరోసా ఎక్కడ? రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రకటనలతోనే పాలన సాగిస్తే క్షేత్రస్థాయిలో రైతులకు న్యాయం ఎలా జరుగుతుంది?కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి గౌరవెల్లి ప్రాజెక్టు నీటి నిల్వ, సాగునీటి సరఫరాపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. హుస్నాబాద్, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో కరువు పరిస్థితులపై పారదర్శకంగా సమీక్ష నిర్వహించి, అర్హత ప్రమాణాల ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలి. రైతులకు అందాల్సిన సహాయం అందేలా చర్యలు చేపట్టాలన్నారు.రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి  పోరాటం చేస్తుంది. రైతులకు న్యాయం జరిగే వరకు  పోరాటాలు ఆగదు అని హెచ్చరించినారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం
మనోహరాబాద్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడత నిధులను శుక్రవారం...
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి -- పోలీసుల విధులు, చట్టాలపై అవగాహన -- సీఐ శ్రీనివాస్
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలి -- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
బాలల హక్కులు రక్షణ చుట్టాల పై అవగాహన కల్పించిన సివిల్ జడ్జి
మండల పార్టీ నూతన కమిటీ ఖరారు
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన
రేపు పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ