పత్తి కొనుగోలు ప్రారంభించిన ప్రశాంత్ రెడ్డి.
చేర్యాల : రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు, వారు పండించిన పత్తికి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో చేర్యాల పట్టణంలోని వాసవి కాటన్ ఇండస్ట్రీస్‌లో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా నిర్వహించాలని, సరైన తూకంతో పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహదేవుని శ్రీనివాస్, చేర్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంజ మల్లేశం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్ రెడ్డితో పాటు చేర్యాల, కొమురవెల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, అనుబంధ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


