పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు ముమ్మరం చేయాలి మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్

పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి


మెదక్‌, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్‌, నాన్‌గ్రేవ్‌, మిస్సింగ్‌, ఎన్‌బీడబ్ల్యూ కేసులతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసులో పక్కా సాక్ష్యాధారాలు సేకరించి, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాలని, దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు.
మిస్సింగ్‌ కేసుల్లో బాధితుల ఆచూకీ గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, ఎన్‌బీడబ్ల్యూ కేసుల్లో వారెంట్ల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లావ్యాప్తంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి విలువైన ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని, ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ప్రతిరోజూ విజిబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించాలని, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెంచాలని ఆదేశించారు.
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచి సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన 34 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్‌, నరేందర్‌ గౌడ్‌, రమేష్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్