బేలా మార్కెట్ యార్డ్‌లో పత్తి కొనుగోళ్లు, ప్రారంబించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా బేలా మార్కెట్ యార్డ్‌లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పత్తి కొనుగోళ్ల ముహూర్త పూజలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్లో పత్తి క్వింటాల్ ధర రూ. 8,910 పలకడం జరిగిందని వారు తెలిపారు. ధరలో మరో రూ. 50 అదనంగా పెరిగితే రైతులు మరింత లబ్ధి పొందుతారని తెలిపారు.. ప్రస్తుతం మంచు కురుస్తున్నందున పంటలో తేమ శాతం పెరిగే అవకాశం ఉందని, రైతులు పంటను 8 నుండి 12 శాతం తేమ శాతానికి తీసుకువచ్చి మార్కెట్‌కు విక్రయానికి తీసుకురావాలని కోరారు. హర్యానా వంటి ప్రాంతాలలో పశువులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ సీడ్‌కు రూ. 200 వరకు ధర అధికంగా వస్తుందని, మన ప్రాంతంలో కూడా రైతులు తగిన తేమతో నాణ్యమైన పత్తిని తెస్తే అందరికంటే రూ. 200 ఎక్కువ ధర ఇప్పించే విధంగా ఎమ్మెల్యే గారు తాము కలిసి తగిన కృషి చేస్తామని భరోసానిచ్చారు. రైతులందరూ ఈ విషయాన్ని గ్రహించి, నాణ్యమైన పంటను విక్రయించి లాభాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎంఓ గజానంద్, కార్యదర్శి శ్రీకాంత్, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మాజీ మార్కెట్ చైర్మన్లు వామన్‌రావు వాంఖడే, అశోక్ రెడ్డి, మైనారిటీ చైర్మన్ బేలా అబ్దుల్ కరీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండావర్, సర్పంచులు బద్దం జగదీశ్వర్ రెడ్డి, శంకర్ భోక్రే, బేలా ఉప సర్పంచ్ ప్రకాష్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు రాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఈశ్వర్,అలీం తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


