కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నరేష్ భార్య నర్సమ్మ ఈ నెల 11వ తేదీ (నవంబర్ 11, 2026) మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో పని నిమిత్తం కోయిలకొండకు వెళ్లొస్తానని భర్తకు చెప్పింది. దీంతో భర్త నరేష్ తన మోటార్ సైకిల్‌పై ఆమెను కేశవపూర్ గేట్ వద్ద దించి వెళ్లిపోయాడు. అనంతరం కోయిలకొండకు వెళ్లిన నర్సమ్మ తిరిగి ఇంటికి చేరుకోలేదు.వివిధ ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో, భర్త నరేష్ మరియు నర్సమ్మ తల్లి వెంకటమ్మ ఈ నెల 12వ తేదీ సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి వెంకటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ ముస్తాక్ అలీ 'ఉమెన్ మిస్సింగ్' కింద కేసు నమోదు చేసి, అన్ని కోణాలలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


