బాలల చిరునవ్వుల్లోనే దేశపు అసలైన సంపద

బాల్యాన్ని కాపాడుదాం బాలల హక్కులను గౌరవిద్దాం

బాలల చిరునవ్వుల్లోనే దేశపు అసలైన సంపద

బంగారు భారతాన్ని నిర్మిద్దాం
బాలల దినోత్సవం ప్రత్యేక కథనం
తరాల శివ చరణ్ నాయుడు
ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : ఒక దేశం గొప్పతనం ఆ దేశంలోని సంపదను బట్టి మాత్రమే నిర్ణయించబడదు, ఆ దేశంలోని బాలల చిరునవ్వులు, వారి భవిష్యత్తు, వారికి లభించే అవకాశాలను బట్టి నిజమైన అభివృద్ధిని అంచనా వేయాలి. ప్రతి చిన్నారి చేతిలో పుస్తకం, ప్రతి పసిమనసులో ఓ లక్ష్యం, ప్రతి బాల్యంలో ఆనందం ఉన్నప్పుడే సమాజం సంపూర్ణ అభివృద్ధి సాధించినట్లవుతుంది, బాల్యం అనేది జీవితంలో మళ్లీ తిరిగిరాని మధురమైన దశ. అమ్మ ఒడిలో అద్భుతం, నాన్న కలలకు చిరునామా, గురువు ఆశయాలకు ప్రతిరూపం. రేపటి దేశ భవిష్యత్తుకు ఆశాకిరణం బాల్యం. చిన్నారుల చిరునవ్వుల్లో స్వచ్ఛత ఉంటుంది, వారి కలల్లో సమాజ మార్పుకు కావాల్సిన శక్తి ఉంటుంది. అందుకే బాల్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రేమించాలి ప్రతి చిన్నారి ఎదుగుదలకు సమాజం అండగా నిలవాలి, ప్రతి చిన్నారి చేతిలో పుస్తకం ఉండాలి. కళ్లలో ఉన్నత లక్ష్యం మెరవాలి, అడుగుల్లో ఆత్మవిశ్వాసం కనిపించాలి. జీవితమంతా ఆనందం వెల్లివిరియాలి. కానీ నేటికీ అనేకమంది చిన్నారులు పేదరికం, నిరక్షరాస్యత, బాలకార్మికత్వం, వివక్ష వంటి సమస్యల కారణంగా తమ అమూల్యమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. బడికి వెళ్లి చదువుకోవాల్సిన పసిచేతులు పనుల్లో నలిగి పోతున్నాయి, ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన వయసులో కుటుంబ బాధ్యతల భారాన్ని మోస్తున్నాయి, మరికొన్ని చిన్నారుల జీవితాల్లో విద్యకు దూరం, పౌష్టికాహార లోపం, రక్షణ కరువవడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. ఎన్నో పసిమనసుల కలలు పేదరికపు చీకటిలోనే కరిగిపోతున్నాయి.

ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు:
సమాజం మొత్తం ఆలోచించాల్సిన కీలకమైన అంశం. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, పౌష్టికాహారం, భద్రత, సమాన అవకాశాలు కల్పించడం మనందరి బాధ్యత. బాలల హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక కర్తవ్యం కూడా. బాల్యాన్ని కాపాడినప్పుడే సమాజంలో మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం బలపడతాయి.

బాల్యం అంటే :
కేవలం ఆటపాటలు, నవ్వులు మాత్రమే కాదు, అది రేపటి సమాజానికి పునాది. నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వైద్యులు, అధికారులు, నాయకులు, దేశ నిర్మాతలు. వారి ఆలోచనలకు స్వేచ్ఛనిచ్చి, కలలకు రెక్కలిచ్చి, ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది, చిన్నారుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం బాధ్యత.ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన విద్య అందాలి: ఏ చిన్నారి కూడా పేదరికం కారణంగా చదువుకు దూరం కాకూడదు, ఏ బాల్యం కూడా బాల కార్మికత్వానికి బలి కాకూడదు. బాలికలు, బాలురు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలి, ప్రతి గడపలో చదువుల దీపం వెలగాలి. ప్రతి పసిమనసులో భద్రతా భావం నిండాలి, ప్రతి చిన్నారికి తన కలలను సాకారం చేసుకునే స్వేచ్ఛ, అవకాశం లభించాలి.

ఒక్కసారి ఆలోచిద్దాం:
ఈరోజు మనం కాపాడుకునే బాల్యమే రేపటి దేశ భవిష్యత్తును నిర్మిస్తుంది. పిల్లల చిరునవ్వులను కాపాడటం అంటే దేశ భవిష్యత్తును కాపాడటమే. వారి హక్కులను గౌరవించడం అంటే మానవత్వానికి విలువనివ్వడమే, చిన్నారుల సమస్యలను గుర్తించి, వారికి అండగా నిలిచి, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, బాలల దినోత్సవం అనేది కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే రోజు మాత్రమే కాదు, బాలల హక్కులు, వారి సంక్షేమం, విద్య, భద్రత, భవిష్యత్తు గురించి సమాజం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన రోజు. ప్రతి చిన్నారికి సంతోషకరమైన బాల్యాన్ని అందించేందుకు మనమంతా కృషి చేయాల్సిన సందర్భం, కాబట్టి పిల్లలను ప్రేమిద్దాం, వారి కలలకు రెక్కలిద్దాం, వారి ప్రతిభను ప్రోత్సహిద్దాం, బాలల హక్కులను పరిరక్షిద్దాం, బాలకార్మికత్వాన్ని నిర్మూలించేందుకు కృషి చేద్దాం, ప్రతి చిన్నారికి ఆనందమయమైన, సురక్షితమైన బాల్యాన్ని అందిద్దాం, ఎందుకంటే దేశపు అసలైన సంపద బంగారం కాదు, భవనాలు కాదు, ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు, స్వేచ్ఛగా నవ్వుతూ, ఆత్మవిశ్వాసంతో ఎదుగుతూ, ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న బాలలే, బాల్యాన్ని కాపాడుదాం. బాలల హక్కులను గౌరవిద్దాం. బంగారు భారతాన్ని నిర్మిద్దాం, బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్