ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!

మహబూబ్ నగర్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!

కోయిలకొండ : ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ‎​వివరాల్లోకి వెళితే.. సక్రియ నాయక్ తండాకు చెందిన గోపాల్ హనుమాన్ రాథోడ్ కుమార్తె మనీషా గోపాల్ రాథోడ్ (25)ను, అన్వాడ మండలం కిష్టం పల్లి తండాకు చెందిన సేనియా నాయక్ కుమారుడు ముడావత్ కృష్ణ అలియాస్ భీమ్లా నాయక్ (29) ప్రేమ పేరుతో మోసం చేశాడు. తాను మనీషాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు ఇష్టం లేదని, పెళ్లి చేసుకోనని చెప్పి చేతులెత్తేసి మోసానికి పాల్పడ్డాడు.​ఈ మోసంపై బాధితురాలు గతేడాది సెప్టెంబర్ నెలలో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, వారు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పటినుంచి పరారీలో ఉన్న నిందితుడు ముడావత్ కృష్ణను పోలీసులు ఈరోజు విజయవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.​అనంతరం నిందితుడిని మహబూబ్ నగర్ (JFCM) కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. కోర్టు విచారణ జరిపి నిందితుడికి రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని మహబూబ్ నగర్ జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.


Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్