టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్
బిజినపల్లి(నాగర్ కర్నూల్) : ఈరోజు బిజినపల్లి మండలం చిన్నపిర్ తండాలో గ ఇంటి వద్ద ఇందిరమ్మ ఇంటికి సర్పంచ్ వర్తవత్ మునిందర్ నాయక్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా పాలన, ప్రజల పాలన, తెలంగాణ రేవంత్ రెడ్డి అన్న పాలన గతంలో ఎప్పుడూ లేనటువంటి పాలన, పేదవాడి పాలన అని అన్నారు. మనకు రేవంతన్న అండగా ఉన్నారని, రాష్ట్రంలోని ప్రతి ఊరు, వాడ, తండా, గూడెం, గల్లీలకు ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇళ్లతో ప్రతి ఇంటా సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ చిన్నయ్య ,డిప్యూటీ సర్పంచ్ మీటియ్య నాయక్ గిరిజన మండల నాయకులు మూడవత్ గోవింద్ నాయక్ బాలు నాయక్ పీకుల నాయక్ సుమన్ నాయక్ పులియా నాయక్ చంద్రు నాయక్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


