మోదీ పాలనలో రైతులకు తీరని ద్రోహం:
నల్గొండ వేదికగా రైతు నేతల ధ్వజం
12 ఏళ్లలో 5 లక్షల మంది రైతులు,కూలీల ఆత్మహత్యలు
స్వామినాథన్ సిఫారసులతో ఎం ఎస్ పి,ఇవ్వాలి.
ఏఐ కేఎస్ జాతీయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్.
ఉమ్మడి నల్గొండబ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి ద్రోహం చేసిందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి విజ్జూ కృష్ణన్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండలో 36వ జాతీయ మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు నల్గొండలో ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 1.58 కోట్ల మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ 20 రాష్ట్రాల నుంచి 1000 మందికి పైగా ఎన్నికైన ప్రతినిధులు,పరిశీలకులతో కలిపి 2000 మంది హాజరవుతారన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి పురిటిగడ్డ అయిన నల్గొండలో మహాసభలు జరగడం చారిత్రకమని,స్ఫూర్తిదాయకమని అన్నారు. రెట్టింపు ఆదాయం హామీ ఏమైంది? 2014లో బీజేపీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ కమిషన్ ప్రకారం సి 2+50 శాతం సూత్రంతో ఎం ఎస్ పి ఇస్తామని హామీ ఇచ్చిందని,కానీ అమలు చేయలేదన్నారు.విత్తనాలు, ఎరువులు, డీజిల్,విద్యుత్ ధరలు విపరీతంగా పెరిగాయని,గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ సి ఆర్ బి లెక్కల ప్రకారం గత 12 ఏళ్లలో 5 లక్షలకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. కార్పొరేట్ దోపిడీకి వ్యవసాయం బలి భూ సంస్కరణలను నీరుగార్చి,రహదారులు, ప్రాజెక్టుల పేరుతో లక్షల ఎకరాలు లాక్కుంటున్నారని ఆరోపించారు.అమెరికా, ఇయు,యుకె లతో చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో విదేశీ సబ్సిడీ పంటలు భారత్ లోకి వస్తే దేశీయ రైతు నాశనమవుతాడని హెచ్చరించారు.2017-23 మధ్య పంటల బీమా కంపెనీలు రైతులకు పరిహారం ఇవ్వకుండా రూ.60 వేల కోట్లు లాభాలు దండుకున్నాయని విమర్శించారు. ఇతర నేతల డిమాండ్లు- ఒకే వేదికపై... ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ ఎల్ నినోతో 365 మండలాల్లో కరువు వచ్చిందని,పత్తి,వరి, మిర్చి పంటలు ఎండిపోయాయని,ఆహార పంటలకు ఎకరాకు రూ.30 వేలు,వాణిజ్య పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని,రైతు భరోసా బకాయిలు,కౌలు రైతులకు ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ వీర తెలంగాణ పోరాటంలో 4500 మంది అమరులయ్యారని, నేడు కూడా నల్గొండ రైతు ఉద్యమాలకు వేదికగా మారుతుందని,మహాసభల కోసం లక్షా పది వేల రైతు కుటుంబాలను కలిశామని తెలిపారు.200 స్టాళ్లతో అగ్రి షో,ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ 22ఏ నిషేధిత జాబితాలో అర్హుల భూములను తొలగించాలని, 10 లక్షల ఎకరాల అటవీ భూములు సాగు చేస్తున్న పేదలకు 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని,ఉపాధి హామీ నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. నవంబర్16న రాకేష్ తికాయత్ రాక-నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళన మహాసభల ప్రారంభ సభకు ఎస్ కే యం నేతలు రాకేష్ తికాయత్,రావుల వెంకయ్య తదితరులు వస్తారని,నవంబర్ 26న ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా రైతు వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తామని ప్రకటించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


