మల్హర్ మండలానికి 382 నూతన చేయూత పెన్షన్లు మంజూరు
15 గ్రామ పంచాయతీల్లో కొత్తగా పెన్షన్ల కేటాయింపు.. తాడిచెర్లకు అత్యధికంగా 89
మల్హర్ రావు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలానికి నూతనంగా 382 చేయూత పెన్షన్లు మంజూరయ్యాయి. మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ కేటగిరీలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్తగా పెన్షన్లు కేటాయించింది. మంజూరైన పెన్షన్లలో 78 దివ్యాంగుల పెన్షన్లు, 14 వివాహిత ఒంటరి మహిళల పెన్షన్లు, 5 అవివాహిత ఒంటరి మహిళల పెన్షన్లు, 26 గీత కార్మికుల పెన్షన్లు, ఒక చేనేత కార్మికుల పెన్షన్, 258 వితంతు పెన్షన్లు ఉన్నాయి.గ్రామాల వారీగా పరిశీలిస్తే తాడిచెర్ల గ్రామానికి అత్యధికంగా 89 పెన్షన్లు మంజూరు కాగా, రుద్రారం గ్రామానికి 56, మల్లారం గ్రామానికి 51, పెద్దతూండ్ల గ్రామానికి 39 పెన్షన్లు కేటాయించారు. ఆన్‌సాన్‌పల్లి, చిన్నతూండ్ల గ్రామాలకు 19 చొప్పున, నాచారం, యడ్లపల్లి గ్రామాలకు 17 చొప్పున, కొయ్యూరు, వల్లెంకుంట గ్రామాలకు 16 చొప్పున, అడ్వాలపల్లికి 14, కొండంపేటకు 13, ఇప్పలపల్లికి 7, దుబ్బపేటకు 5, మల్లంపల్లికి 4 పెన్షన్లు మంజూరయ్యాయి.నూతనంగా పెన్షన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పెన్షన్ల ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంతమేర భరోసా లభించనుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


