చెన్నాపూర్లో ఉచిత పశువైద్య శిబిరం
పాడి రైతులకు అందుబాటులో ఉచిత పశువైద్య సేవలు
శివ్వంపేట : శివ్వంపేట మండలం చెన్నాపూర్ గ్రామంలో ఈరోజు ఉచిత పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు పలు రకాల వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా దూడలకు నట్టల నివారణ మందులు తాగించడంతో పాటు, పశువులకు కృత్రిమ గర్భధారణ, గర్భ నిర్ధారణ పరీక్షలు (ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్), ప్రథమ చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఆకుల కొమురయ్య, ఉపసర్పంచ్ గుమ్ముల శ్రీలత శ్రీనివాస్ పాల్గొన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ శిబిరంలో పశువైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, వీఏఎస్, గోపాలమిత్ర సూపర్వైజర్ సత్యనారాయణ, గోపాలమిత్రలు శ్రీనివాస్, రాములు, ఎల్లయ్యతో పాటు పాడి రైతులు గొల్ల మల్లేష్ యాదవ్, ఆకుల సాయికుమార్, ఆకుల కొమురయ్య, ఆకుల మల్లేష్, ఆకుల యాదగిరి, ఆకుల భూమయ్య, ఆకుల బిక్షపతి, గుండా పోచయ్య, మన్నె నారాయణ, ఆకుల లక్ష్మయ్య, బోల బిక్షపతి, ఆకు శ్రీనివాస్, సిరిపురం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


