సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు

భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి: ఎంపీడీఓ కె. శంకర్

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు

చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి మార్కౌట్ నిర్వహించారు. అదేవిధంగా రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల నిర్మాణానికి స్థల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కె. శంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణం వల్ల వర్షపు నీరు, ఇంటి పరిసరాల్లో వృథాగా బయటకు వెళ్లే నీటిని భూమిలోకి ఇంకించే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకొని తమ ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చంటి గీతారాణి రమేష్, ఎంపీఓ కె. రాజకుమార్, ఏపీఓ రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి పావని, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ఉపసర్పంచ్ మహేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Views: 86

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎