వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : బిజినాపల్లి మండలం వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం దగ్గర నూతనంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేసే కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో మహిళలకు, మహిళా సంఘం సభ్యులకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత, గౌరవానికి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిజినాపల్లి మండలం MPO విశాల్ కుమార్, గ్రామ సెక్రెటరీ మహేశ్, డిప్యూటీ సర్పంచ్ వినీత్, మహిళా సంఘం అధ్యక్షులు రాఘవేంద్ర, మాధవి, మహిళా సంఘం సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. గ్రామంలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.MPO విశాల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పరిశుభ్రత పాటించడం చాలా అవసరమని, మరుగుదొడ్లను సక్రమంగా వినియోగించుకుని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ మహిళా సంఘం భవనం వద్ద మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఈ నిర్ణయం తీసుకున్న సర్పంచ్, పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.గ్రామస్తులు, యువకులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ సర్పంచ్, పాలకవర్గాన్ని అభినందించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచుకుంటామని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


