సొంత ఖర్చులతో బస్టాండ్‌కు కొత్తరూపు.. ఆంజనేయులు సేవాభావం

సొంత ఖర్చులతో బస్టాండ్‌కు కొత్తరూపు.. ఆంజనేయులు సేవాభావం

శివంపేట, : మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వాల్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యదర్శి గుద్దేటి ఆంజనేయులు తన సేవాభావాన్ని చాటుకున్నారు. గ్రామంలోని పాత బస్టాండ్‌కు తన సొంత ఖర్చులతో స్వయంగా పెయింటింగ్ వేసి కొత్త రూపాన్ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. తనకు వచ్చిన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడే మంచి పనుల కోసం వినియోగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తన వంతుగా గ్రామ అభివృద్ధికి, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తానని పేర్కొన్నారు. పాత బస్టాండ్‌ను అందంగా తీర్చిదిద్దిన గుద్దేటి ఆంజనేయులును గ్రామస్తులు అభినందించారు. ఆయన సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.

Views: 113

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్