కేరళ ఇంగ్లీష్ మీడియం ఆధ్వర్యంలోఎల్ నీనోపై అవగాహన ర్యాలీ
ఎల్ నినో వల్ల కలిగే ప్రభావాలపై ప్రజలకు వివరించిన విద్యార్థులు
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు పాఠశాల నుండి స్థానిక మల్లెచెట్టు వరకు ఎల్ నీనో ప్రభావంపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు.మల్లె చెట్టు చౌరస్తాలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి ఎల్ నీనోపై కలిగే ప్రభావాలు నష్టాలను,ఎలా ఏర్పడుతుందో వివరించారు.ఈ సందర్భంగా కేరళ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ చైర్మన్ బుర్ర రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ ఎల్ నీనో ప్రపంచవాతావరణన్ని మార్చే సముద్ర ప్రక్రియ అని అన్నారు.దింతో ప్రభావంతో సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు నుండి పడమరకు వీచే పవనాలు వేడి నీటిని ఆసియా వైపునకు నేడతాయన్నారు. వాతావరణంలో మార్పులు వస్తాయని దీంతో కొన్ని ప్రాంతాల్లో కరువు ఏర్పడుతుందని ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అన్నారు.రుతుపవనాలు బలహీనపడి వర్షాలు తగ్గడంతో భూగర్భ జలాలు అడుగంటు పోతాయని నీటిని పొదుపుకో వాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్లే శైలేందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

