తాడిచర్ల ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సర్పంచ్ బండి స్వామి
-విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఉపాధ్యాయులకు సూచనలు
మల్హర్ మండలం : మల్హర్ మండలంలోని తాడిచర్ల గ్రామంలో గల జెడ్పీఎస్ఎస్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల చదువులు, విద్యా ప్రమాణాలు, రోజువారీ హాజరు వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులందరూ ప్రతిరోజూ తప్పనిసరిగా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు రుచికరంగా ఉండేలా చూడాలని, పరిశుభ్రమైన వాతావరణంలో భోజనం వడ్డించాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


