రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హుస్నాబాద్ విద్యార్థులు
హుస్నాబాద్ : నవంబర్ 12వ తేదీ నుండి 14 వ తేదీవరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 36 వ రాష్ట్ర స్థాయి సబ్ - జూనియర్ కబడ్డీ పోటీలలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ( బాలుర) విద్యార్థులుఎస్ రామ్ చరణ్ ,సి.ఎచ్ సంజయ్ మాధవన్ 10వ తరగతి,ఎస్ కె. బాబా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు సిద్దిపేట జిల్లా సబ్ జూనియర్ కబడ్డీ టీంకు ప్రతినిత్యం వహిస్తున్నట్లు పిడి ఆర్. శ్రీనివాస్ తెలియజేశారు.ఈ సందర్బంగా గజ్వేల్ లో నిర్వహించిన ఎంపిక పోటీలలో ప్రతిభను చాటుకున్న వీరిని జిల్లా జట్టుకు ఎంపిక అయినట్లు తెలిపారు.క్రీడాకారులు మంచి నైపుణ్యాలు ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ప్రధానోపాధ్యాయులు కె. వాసుదేవ రెడ్డి అన్నారు.వీరి ఎంపిక పట్ల సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సంతోష్ గుప్త, అసోసియేషన్ సెక్రటరీ కె శివ కుమార్, కబడ్డీ కోచ్ కృష్ణ మరియు సీనియర్ క్రీడాకారులు గద్దల రమేష్, రాజేశ్,అఖిల్ క్రీడాకారులను అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


