అభిమానుల మధ్య .. ‘ఇట్లు అర్జున’ మూవీ సందడి...
ఏఎంఆర్ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు, వేడుకలు
మల్హర్ : ఎ.ఎం.ఆర్. గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్తూరి మహేష్ కుమార్ రెడ్డి గారి చిన్న కుమారుడు ఆల్తూరి సాయి అనీష్ రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఇట్లు అర్జున’ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా మంథనిలో అభిమానులు, ఏఎంఆర్ సంస్థ ప్రతినిధుల సందడి నెలకొంది.ఎ.ఎం.ఆర్. తాడిచెర్ల కోల్ బ్లాక్-1 ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంథనిలోని ఎస్.ఆర్. సినిమా థియేటర్ వద్ద సినిమా విడుదల వేడుకలను ఘనంగా నిర్వహించారు. హీరో ఆల్తూరి సాయి అనీష్ రెడ్డి భారీ ఫోటో కటౌట్ ఏర్పాటు చేసి, డీజే సౌండ్స్, బాణాసంచా కాల్పుల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించారు. అభిమానులు, ఉద్యోగులు, కార్మికులు ఉత్సాహంగా పాల్గొని సినిమా విడుదల వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకున్నారు.హీరోగా తొలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆల్తూరి సాయి అనీష్ రెడ్డికి మద్దతుగా ఏఎంఆర్ సంస్థ అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎన్. మూర్తి, మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు, అడ్మిన్ జనరల్ మేనేజర్ వెంకట్, సర్వే డీజీఎం శేషావతారం, జీఎం మెకానికల్ విశ్వ ప్రసాద్, హెచ్‌ఆర్ డీజీఎం రమేష్ బాబు, పిట్ ఇంజనీర్ కిషన్, సర్వే డీజీఎం సరోత్తమ్‌తో పాటు అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


