జూలపల్లిలో ఘనంగా 'చదువుకో తెలంగాణ' పోస్టర్ ఆవిష్కరణ.. మండల టాపర్‌కు చెక్కు పంపిణీ

జూలపల్లిలో ఘనంగా 'చదువుకో తెలంగాణ' పోస్టర్ ఆవిష్కరణ.. మండల టాపర్‌కు చెక్కు పంపిణీ

జూలపల్లి : పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు ప్రతిభావంతులైన విద్యార్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) శ్రీరాముల లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టాపర్‌గా నిలిచిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని సాయి హర్షితను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ప్రోత్సాహార్థం రూ. 10,000 విలువైన చెక్కును ఎంఈవో శ్రీరాముల లక్ష్మణ్ మరియు ఉపసర్పంచ్ కొప్పుల మహేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గ్రూప్ - తెలంగాణ తరఫున పెద్దపల్లి డివిజన్ ఆర్ఎం వెంకటరజం, గోదావరిఖని బ్రాంచ్ మేనేజర్ మల్లెతుల శ్రీనివాస్, ఎంప్లాయిస్ డీవో జంగం సతీష్, సేల్స్ ఆఫీసర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. “చదువుకో తెలంగాణ – విద్యతోనే అభివృద్ధి, ప్రతిభకు ప్రోత్సాహమే మా లక్ష్యం!” అనే నినాదంతో ముందుకు సాగుతున్న శ్రీరామ్ గ్రూప్ - తెలంగాణ వారికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్