మక్తల్ కు రెగ్యులర్ జడ్జి... ఎన్నో ఏళ్ల కల...

ఘనంగా సత్కరించి స్వాగతం పలికిన న్యాయవాదులు...

మక్తల్ కు రెగ్యులర్ జడ్జి... ఎన్నో ఏళ్ల కల...

మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా కాసర్ల అవినాష్ నియామకం కావడంతో... మక్తల్ న్యాయవాదులు ఆయనకు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. మక్తల్ కోర్టు అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు తిమ్మన్న పూల బొకే ఇచ్చి జడ్జికి స్వాగతం పలికారు. అనంతరం మక్తల్ న్యాయవాదులు, నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి అవినాష్ ను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... మక్తల్ రెగ్యులర్ రావడంతో చుట్టుపక్కల దాదాపు 50 పైగా గ్రామాల ప్రజల ఇబ్బందులు దూరమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట తో పోల్చితే మక్తల్ లోనే కేసులు ఎక్కువ అని, రెగ్యులర్ జడ్జి రాకతో కేసుల పరిష్కారం మరింత వేగవంతం కానుందని తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ న్యాయవాదులు, నారాయణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్