జర్నలిస్ట్ ల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని జర్నలిస్ట్ ల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పరామర్శించారు.ఈ సందర్బంగా కోన ఊపిరి ఆగేదాకా తొనకని గుండె దైర్యంతొ జీవించినోళ్లు జర్నలిస్ట్ కాశబోయిన రవీందర్ కొండ లక్ష్మమ్మలు అని అన్నారు.బాధిత జర్నలిస్టుల కుటుంబాలను అక్కన్నపేట మండలం గొల్లకుంటకు గ్రామానికి చెందిన జర్నలిస్టు కాశబొయిన రవిందర్ ఈ నెల 5వ తేదీన తన వ్వవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చి హఠాత్తుగా గుండెపోటుతొ హాటన్మరణం కాగా గురువారం రోజున సిపిఐ సినీయర్ నేత రవిందర్ కుటుంబాన్ని పరామర్శించి రవిందర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుని సతీమణి రాధిక, కూతురు హన్సిక,కుమారులు రాము,లక్ష్మణ్ లను దగ్గరకు తీసుకోని ఆత్మీయ భరోసాగా కుటుంబానికి ఎప్పుడూ కమ్యూనిస్ట్ లు గా మేము అండగా ఉన్నామని,యువ జర్నలిస్టు కుటుంబాన్ని ఆదుకుంటామని చాడ వెంకటరెడ్డి మనోధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.అనంతరం హుస్నాబాద్ కు చెందిన సీనియర్ జర్నలిస్టులు కొండ లక్ష్మణ్, రవిందర్ ల మాతృమూర్తి కొండ లక్ష్మి (లస్మవ్వ) ఈనెల10న హఠాత్తుగా మరణించడంతో చాడ వెంకటరెడ్డి కొండ లక్ష్మణ్, రవిందర్ కుటుంబాన్ని పరామర్శించి లక్ష్మి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డ హుస్నాబాద్ నియోజకవర్గ సిపిఐ కన్వీనర్ జాగీర్ సత్య నారాయణ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్,గొల్లకుంట గ్రామ సర్పంచ్ కాశబొయిన రాజవ్వవెంకయ్య,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


