ఘనంగా నాగుల చవితి వేడుకలు

పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న మహిళలు

ఘనంగా నాగుల చవితి వేడుకలు

రాయపర్తి, : హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన పర్వదినాల్లో ఒకటైన నాగుల చవితి వేడుకలు శుక్రవారం ఘనంగా భక్తిశ్రద్దలతో జరిగాయి.మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో ఉదయం నుంచే స్థానిక మహిళలు,యువతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.పుట్టల వద్దకు చేరుకున్న మహిళలు పసుపు కుంకుమలతో పుట్టను అలంకరించి, భక్తితో నాగదేవతకు పాలు,గుడ్లు,అరటిపండ్లు, తాంబూలం నైవేద్యంగా సమర్పించారు.కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు,సర్వవిధ శ్రేయస్సును కాపాడాలని కోరుతూ నాగదేవతకు ముక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మహిళల సాంప్రదాయ వస్త్రధారణ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.పుట్టల వద్ద భక్తుల రద్దీతో సందడి నెలకొంది.నాగారాధన మన సంస్కృతిలో భాగమని,ప్రకృతిని,జీవరాశిని దైవంగా భావించి పూజించడం మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయమని మహిళలు అన్నారు.పూజ అనంతరం తమ మంగళ సూత్రాలకు బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా  పండుగ ఆచారాలను పూర్తి చేశారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్