ఎస్ బి ఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్!!

వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

ఎస్ బి ఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్!!

కామారెడ్డి  : కామారెడ్డి జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో ఈనెల 11న జరిగిన ఎస్ బి ఐ ఏటీఎం ధ్వంసం చేసి దొంగతనాని కి పాల్పడిన నిందితుడిని కామారెడ్డి పట్టణ పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్ బి ఐ ఏటీఎం కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలను తొలగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఏటీఎం భద్రతా విభాగం నుండి ఒక్కసారిగా అలారం (సైరన్) మోగడంతో భయపడిపోయి డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, పట్టణంలోని వాల్మీకి బ్యాండ్ షాపులో పనిచేస్తున్న మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన మహేష్ జ్ఞానోబా బిందే (33) ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. అప్పు తీర్చడానికే దొంగతనం చోరీ యత్నం కు పాల్పడ్డట్లు, తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పట్టణంలోనే తలదాచుకున్న నిందితుడు, తన స్వగ్రామానికి పారిపోయేందుకు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తాను ఒకరి వద్ద తీసుకున్న రూ.10 వేల అప్పు తీర్చేందుకే ఏటీఎం చోరీకి పథకం వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, ఏటీఎం నుండి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లుఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, సాంకేతిక ఆధారాల సాయంతో గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నర్సింలు, హోంగార్డు మోహన్ రెడ్డిలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర నగదు రివార్డ్ తో ప్రోత్సహించి ప్రత్యేకంగా అభినందించారు. ఏటీఎంల భద్రత విషయమై బ్యాంక్ అధికారులతో తగిన జాగ్రత్తల గురించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ రావు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు కోయిలకొండలో వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
‎కోయిలకొండ మండలంలోని కేశవపూర్ గ్రామానికి చెందిన గంగెడ్ల నర్సమ్మ (18) అనే వివాహిత అదృశ్యమైనట్లు కోయిలకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ‎​పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.....
ఎల్-నినో పైన అవగాహన సదస్సు
పెండింగ్‌ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి
ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు!
చలో నర్సాపూర్ ధర్నాను విజయవంతం చేద్దాం.
వట్టెం గ్రామంలో మహిళా సంఘం భవనం వద్ద నూతన మరుగుదొడ్లు ఏర్పాటు
టైటిల్.ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ చేసిన సర్పంచ్ మునీందర్ నాయక్