విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు ఎంచుకోవాలి
ప్రముఖ సైకాలజిస్ట్ పల్లె నాగేశ్వరరావు
రాయపర్తి : విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని,సరైన మార్గంలో పయనించినప్పుడే బంగారు భవిష్యత్తుకు బాటలు పడుతాయని ప్రముఖ సైకాలజిస్ట్ పల్లె నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం మండలంలోని కొండూరు గ్రామంలోని పి.ఎం.శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్' (భవిష్యత్ మార్గదర్శకత్వం) కార్యక్రమాన్ని అత్యంత స్ఫూర్తిదాయకంగా నిర్వహించారు.ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.పదవ తరగతి తర్వాత అందుబాటులో ఉన్న వివిధ కోర్సులు,ఉపాధి అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.ఇతరుల ఒత్తిడితో కాకుండా,విద్యార్థులు తమ అభిరుచికి,ఆసక్తికి అనుగుణంగా ఇష్టమైన కోర్సులను ఎంచుకోవాలని సూచించారు.అంతేకాకుండా,చదివిన పాఠ్యాంశాలను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో వివరించారు.పరీక్షల ఒత్తిడిని అధిగమించి ఏకాగ్రతను పెంచుకోవాలన్నారు.విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.ప్రధానోపాధ్యాయురాలు కొణతం పద్మలత మాట్లాడుతూ.. పి ఎం శ్రీ కార్యక్రమాల్లో భాగంగా నిపుణులు అందించిన ఈ అమూల్యమైన సూచనలను విద్యార్థులు ఆచరణలో పెట్టి,ఇప్పటి నుంచే తమ కెరీర్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు వి.వి.ఆర్.ఆచార్య, ఉపాధ్యాయులు కేసోజు సత్యనారాయణ,కటకం రఘు, శ్యాంసుందర్,నాగరాజు,అనితారాణి,అమర స్వర్ణ, శివకృష్ణ,రాజు,రమ,వీరస్వామి,నరేష్,స్వరూప పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


