నాగర్ కర్నూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రింటర్ అందజేత
జిల్లా నాగర్‌కర్నూల్ : క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు ప్రింటర్ అందజేశారు.క్లాస్‌మేట్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ వాస రాఘవేందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సహకారంతో 365 రోజుల్లో 317వ సేవా కార్యక్రమంగా ప్రింటర్‌ను వితరణ చేశారు.క్లబ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పోలో శ్రీనివాస్, డాక్టర్ రమేష్ చంద్ర, కిషన్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరుల చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపల్ రవి ప్రకాష్‌కు ప్రింటర్‌ను అందించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని అభినందనలు తెలిపారు. అధ్యాపకులు వెంకటరెడ్డి, సత్యం, యూనస్, షఫీ, నరేందర్ గౌడ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.సేవా కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు కూడా పాల్గొన్నారూ
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


